శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలోని పాలెపల్లి ఐకేపీ సెంటర్‌లో ధాన్యాన్ని పరిశీలించాలని వైఎస్ షర్మిల భావించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి కారులో బయలుదేరారు. అయితే, ఆమె కాన్వాయ్ వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే పోలీసులు నిలిపివేశారు.
కొవిడ్ నిబంధనల కారణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉందనీ, నిబంధనలను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయడంతో షర్మిల మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల మరికాసేపట్లో దోమ మండలం పాలెపల్లికి చేరుకోనున్నారు.