కరోనా నియంత్రణకు 60-70 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోతుందని ప్రారంభంలో అంచనా వేశామని, అయితే, తమ అంచనాలకు మించి డెల్టా వేరియంట్ రెట్టింపు వేగంతో వ్యాపిస్తోందన్నారు. 80 నుంచి 90 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తేనే డెల్టా వేరియంట్‌ను కట్టడి చేయవచ్చన్నారు. వ్యాక్సినేషన్‌ను అన్ని దేశాలు ముమ్మరం చేయాలని సూచించారు.