ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐతే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లతో కిటకిటలాడిపోతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఎవరైనా వస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ జనం మాత్రం వినడంలేదు.
మీకు డౌట్ వచ్చిందిగా.... అవే మాత్రలు రాసేయండి. ఇంక టెస్టులు ఎందుకు అని అక్కడే తిష్ట వేస్తున్నారు. దీనితో వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రలు, ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఐతే ఇలా టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల పక్కవారు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో నెట్టేసినవారవుతారు.