దీనివల్ల కరోనా వైరస్ పరిమాణంలోని రేణువులను వడకట్టే సామర్థ్యం రెట్టింపవుతుందని వ్యాఖ్యానించారు. వీటిని ధరించిన వారి ముక్కు, గొంతులోకి అవి ప్రవేశించకుండా చాలావరకూ రక్షణ లభిస్తుందని తెలిపారు. అయితే ఈ మాస్కులు.. ముఖంపై దృఢంగా అమరేలా చూసుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలో వివిధ రకాల మాస్కులు సామర్థ్యాన్ని పరీక్షించినట్లు తెలిపారు. తల వంచడం, మాట్లాడటం, తల పక్కకు తిప్పి చూడటం వంటి సాధారణ చర్యలను అనుకరించి, ఆ సమయంలోనూ మాస్కుల సామర్థ్యాన్ని పరిశీలించామన్నారు.