అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్స్ భవన్‌పై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టిన విషయం తెల్సిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ వంటి ఖాతాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
హింసను ప్రేరేపించేలా అందులో కంటెంట్ ఉండటంతో యూట్యూబ్ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు ట్రంప్ తన ఛానల్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయలేరు. కాగా, ట్రంప్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని సామాజిక సంఘాలు డిమాండ్ చేయడంతో యూట్యూబ్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ ఛానెల్‌పై చర్యలు తీసుకోకపోతే దానికి వాణిజ్య ప్రకటనలను నిలిపివేసేలా ప్రచారం చేపడుతామని ఆ సంస్థలు హెచ్చరించాయి. అందులో ఎన్నికల గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపించాయి. అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగినట్లు ఓ వీడియోలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కాగా, ట్రంప్ యూట్యూబ్‌ను 2.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఫాలోఅవుతున్నారు.