కరోనాను కట్టడి.. యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్‌కు ఆమోదం

గురువారం, 6 మే 2021 (12:49 IST)
Roche
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరో యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్‌కు ఆమోదం లభించింది.

రోచె (ROG.S) రెజెనెరాన్ (REGN.O) అభివృద్ధి చేసిన COVID-19 యాంటీబాడీ డ్రగ్ కాక్‌టైల్‌కు భారత్ అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. దేశంలో సెకండ్ వేవ్ వ్యాప్తితో పోరాడటానికి ఈ డ్రగ్‌ను సంస్థ విస్తరించింది. 
 
ఈ డ్రగ్ ఇప్పటికే అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. ఐరోపాలో ఆసుపత్రిలో చేరని కరోనా రోగులకు ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాధి బారిన పడినప్పుడు ఇదే డ్రగ్ తీసుకున్నారు. 
 
తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారితోపాటు తేలికపాటి నుంచి స్వల్పంగా వైరస్ లోడ్ ఉన్నవారికి ఈ డ్రగ్ ప్రయోజనకరంగా ఉంటుందని సిప్లా కంపెనీ వెల్లడించింది. ఈ డ్రగ్ ధర లేదా ప్రారంభ తేదీని వెల్లడించలేదు. గత 10 రోజుల్లో 33వేల మందికి పైగా భారతీయులు కోవిడ్ మరణించారు.
 
దేశంలో గిలియడ్ (GILD.O) అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్, రోచె tocilizumabతో సహా COVID-19 డ్రగ్స్ కొరతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, స్థానిక తయారీదారులు ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 20 మిలియన్లను దాటింది. యునైటెడ్ స్టేట్స్ తరువాత భారత్ రెండవ స్థానంలో ఉంది. కరోనా మరణాలు 226,188కు చేరుకున్నాయి. అధికారక గణాంకాల కంటే అసలు కరోనా మరణాల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు