పబ్ జీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌‍లోకి సూపర్ గేమ్

మంగళవారం, 4 మే 2021 (22:48 IST)
భారత్‌-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి పబ్‌జీ ప్రియులు ఆ గేమ్‌ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందా…? అంటూ ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్‌జీ సంస్థ తన ఆడియన్స్‌ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్‌ డేట్‌లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. 
 
తాజాగా పబ్‌జీ మాతృ సంస్థ పబ్‌జీ పేరును 'బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా' గా మారుస్తూ కొత్త పోస్టర‍్లను విడుదల చేసింది. దీనికి సంబంధించి పబ్‌జీ సంస్థ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్‌ చేసింది. దీంతో పబ్‌జీ గేమ్‌ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
 
ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని వేగం చేసింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ లింక్డిన్‌‌లో పోస్టింగ్‌‌లను అప్‌ డేట్‌ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్‌ రిలేషన్‌ మేనేజర్‌ పోస్ట్‌కు రిక్రూట్‌ మెంట్‌ నిర్వహించింది.
 
దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్‌కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. తమ వంతు సాయంగా భారత్‌ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ క్రాఫ్టన్‌ సీఈఓ చాంగ్హాస్‌ కిమ్‌ కూడా ప్రకటించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు