కరోనా కోరల్లో ప్రపంచం.. భారతే దారిచూపాలి : డబ్ల్యూహెచ్ఓ

మంగళవారం, 24 మార్చి 2020 (12:31 IST)
ప్రస్తుతం ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క భారతదేశం మాత్రమే ప్రపంచానికి దారిచూపగలదని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. 
 
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా సోకిందన్నారు. ఈ వైరస్ బారినపడి 15 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మీడియాతో మాట్లాడారు. 
 
క‌రోనా వైర‌స్ లాంటి మ‌హ‌మ్మారిని ఎదుర్కొనే సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉంద‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో రెండు సార్లు ఇలాంటి మ‌హా విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి భార‌త్ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌శూచీ లేదా అమ్మ‌వారు, పోలియో సోకిన స‌మ‌యంలో భార‌త్ చూపించిన తెగువ‌ను ఆయ‌న మెచ్చుకున్నారు. 
 
వైర‌స్ గురించి ప‌రీక్షించేందుకు చాలా వ‌ర‌కు ప‌రిశోధ‌న‌శాల‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. భార‌త్‌లో జ‌నాభా ఎక్కువ అని, ఇంత జ‌న సాంద్ర‌త క‌లిగిన దేశంలోనే వైర‌స్‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, గ‌తంలో భార‌త్ ఇలాంటి రెండు మ‌హోప‌ద్ర‌వాల‌ను ఎద‌ర్కొన్న‌ద‌ని, త‌ట్టు, పోలియో నివార‌ణ‌లో భార‌త్ విజ‌యం సాధించింద‌ని, ఇప్పుడు కూడా క‌రోనాను ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు ఉంద‌ని ర్యాన్ తెలిపారు. 
 
ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సుల‌భ‌త‌ర‌మైన ఉపాయాలు ఏవీ లేవ‌ని, భారత్ వంటి దేశాలే ఓ మార్గాన్ని చూపాల‌ని, వాళ్ల‌కు గ‌త అనుభ‌వం ఉన్న దృష్ట్యా.. ఇది ఆయా దేశాల‌కు సాధ్య‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డైర‌క్ట‌ర్ అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స్వీయ ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న‌ది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు