దేశంలో కోటి మార్కును దాటిన కరోనా వైరస్

శనివారం, 19 డిశెంబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా వైరస్‌లు కోటి మార్కును దాటాయి. అమెరికా అనంతరం భారత్‌లోనే ఈ స్థాయిలో కేసులు నమోదవడం గమనార్హం. శుక్రవారం 11,71,868 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25,152 కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అయితే కేసులు కోటి మార్కును దాటినప్పటికీ.. గత కొద్దిరోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల లేదని తెలిపింది. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 347మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,45,136కి చేరింది. 
 
యాక్టివ్‌ కేసుల్లోనూ రోజురోజుకి తగ్గుదల కనిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు 95,50,712 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 95 శాతంపైన ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు