జూన్ 14 కరోనా బులిటెన్ : కొత్తగా 70 వేల కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 14 జూన్ 2021 (09:55 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం కూడా 70 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ గత 24 గంటల్లో నమోదైన కేసులు. తాజాగా బులిటెన్ ప్రకారం24 గంట‌ల్లో కొత్తగా 70,421 కేసులు న‌మోద‌య్యాయి. 
 
ఏప్రిల్ 1 త‌ర్వాత ఇంత త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. అయితే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఉంది. 24 గంట‌ల్లో 3921 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఇక 1,19,501 మంది క‌రోనా నుంచి కోలుకొని ఇళ్ల‌కు వెళ్లారు. 
 
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. కోలుకున్న వారు 2,81,62,947 కాగా.. చ‌నిపోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,73,158 ఉన్నాయి. ఇక వ్యాక్సినేష‌న్ల సంఖ్య 25,48,49,301కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.
 
మరోవైపు, ఆదివారం నాటి కరోనా బులిటెన్ మేరకు.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి క్రమంగా నెమ్మదించింది. కొన్నివారాల కిందట మహోగ్రంగా సాగిన కరోనా వ్యాప్తి ఇప్పుడు మరింత తగ్గింది. 
 
గడచిన 24 గంటల్లో 91,621 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,280 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 156 కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదేసమయంలో 2,261 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,03,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,78,748 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,137 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 3,484కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు