కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ: 24 గంటల్లో 20వేల కేసులకు పైగా నమోదు

బుధవారం, 28 జులై 2021 (23:12 IST)
దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతుంది. కారణం కేరళలో కరోనా విజృంభించడమే. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. 
 
అయితే మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు, మొత్తం మరణాల సంఖ్య 16,457కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 17,761 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,60,804కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు