భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ సతీమణి నిర్మల కౌర్ (85) కరోనాతో కన్నుమూశారు. మొహలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు వారాల పాటు కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్ మరణించేనాటికి ఆమె వయస్సు 85 సంవత్సరాలు.