మే 3 వరకు లాక్‌డౌన్ : అనుమతులున్నవి.. అనుమతులు లేనివి ఏవి?
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:48 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడించడం జరిగింది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. హాట్‌స్పాట్‌లేని ఏరియాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొంత సడలింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ పరిస్థితుల్లో 20వ తేదీ తర్వాత అనుమతులు ఉన్నవి ఏవి? అనుమతులు లేనివి ఏవి? అనే అంశాన్ని పరిశీలిస్తే,
అనుమతులు లేనివి...
* అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి నిరాకరణ (వైద్య, భద్రతకు సంబంధించిన విమానాలకు మినహాయింపు).
* రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు సర్వీసుల నిలిపివేత.
* అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య రవాణా నిషేధం (వైద్య సేవల వాహనాలకు మినహాయింపు)
* విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, కోచింగ్ కేంద్రాలు, సినిమా హాల్స్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, బార్లు, ఆడిటోరియంలు మూసివేత.