ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు అంత సులభం వదిలిపోవని.. రోజులు గడిచినా.. ఆ లక్షణాలు నెలల తరబడి వుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజులు గడుస్తున్న కొద్ది కొంతమందిలో అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని ఆ అధ్యయనం తెలిపింది. క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ జర్నల్‌లో వెల్లడించారు.
మార్చి నుంచి జూన్ మధ్యలో స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలు ఉన్న 150 మందిపై ఈ అధ్యయనం జరిపారు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, జ్వరం, జలుబు సహా కరోనా లక్షణాల్లో ఏదో ఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు.