భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, అనేక వందల మంది మృత్యువాతపడుతున్నారు. కరోనా రోగుల రికవరీ రేటు కూడా పడిపోతుంది. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే, మరణాల శాతం విపరీతంగా పెరుగుతోంది. స్థానికంగా ఉండే స్మశాన వాటికలన్నీ కూడా కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్నాయి. దీంతో శ్మశానంలో ఖననం చేసేందుకు స్థలం కొరత ఏర్పడింది.
అమర్‌ధామ్‌లో ఒకేసారి 22 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. అలాగే ఒక రోజులో ఏకంగా 42 మందికి చితి పెట్టారట. కాగా, కరోనా రోగులకు దహన సంస్కారాలు చేయడంలో అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ సవాల్ ఎదుర్కుంటోంది.