గన్నవరం ఎయిర్‌పోర్ట్ పైన గాల్లో 7 రౌండ్లు కొట్టి వెనక్కెళ్లిన విమానం, ఎందుకని?
శనివారం, 23 జనవరి 2021 (14:39 IST)
ఆంధ్ర రాష్ట్రాన్ని దట్టమైన మంచుదుప్పటి కప్పేస్తోంది. ఉదయాన లేచి చూస్తే నాలుగడుకులు దూరంలో ఏమున్నదో కనిపించడంలేదు. ఇప్పుడీ పరిస్థితే విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తోంది.
శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి ల్యాండ్ అయ్యేందుకు ఇండిగో విమానం వచ్చింది. ఐతే కింద ల్యాండ్ అయ్యేందుకు ఏమీ కనబడటంలేదు. దాంతో విమానాశ్రయం ప్రాంతంలో గాల్లోనే 7 రౌండ్లు కొట్టింది. కాస్తయినా మార్గం కనబడుతుందేమోనని.
కానీ మంచు దుప్పటి అలాగే కప్పేసి వుండటంతో విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఈ పరిస్థితి గత వారం నుంచి ఎదురవుతోందనీ, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.