దేశంలో గత 24 గంటల్లో 39,070 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 43,910 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే... గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,27,862కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,99,771 మంది కోలుకున్నారు.
4,06,822 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. శనివారం 55,91,657 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటివరకు మొత్తం 50,68,10,492 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
మరోవైపు, తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గింది. శనివారం వెల్లడైన మీడియా బులిటెన్ మేరకు గడచిన 24 గంటల్లో 1,05,201 కరోనా పరీక్షలు నిర్వహించగా, 569 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 64, వరంగల్ అర్బన్ జిల్లాలో 51, ఖమ్మం జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
ఇప్పటివరకు 6,48,957 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,36,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,823కి చేరింది.