చిరంజీవి ఓ విషయంలో తనతో సినిమా తీయబోయే నిర్మాతలు ఖర్చు ఎక్కువకావండా జాగ్రత్త చెప్పాడట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈనెల 13న మెగాస్టార్‌తో లూసిఫర్ రీమేక్ సినిమాను ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఇతర పాత్రల ఎంపికలకు జూబ్లీహిల్స్‌లోని సూపర్‌గుడ్ ఆఫీస్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇదిలా వుండగా, మరోవైపు తమిళ వేదాలం రీమేక్ కూడా జరగబోతుంది. ఇందులో ఒరిజినల్ భాషలో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు సాయిపల్లవిని సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.