ఉత్తరాఖండ్‌లో 2300మది పోలీసులకు సోకిన కరోనా రక్కసి.. 64 మంది మృతి

గురువారం, 3 జూన్ 2021 (15:17 IST)
కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైద్యులు, పోలీసులు కరోనా మహమ్మారిన పడుతున్నారు. రేషన్, పాలు, వండిన ఆహారాన్ని 94,484 మందికి అందించారు. 492 మంది కొవిడ్ మృతులకు దహన సంస్కారాలు చేశారు. ప్రజలకు రేషన్, అంబులెన్సులు అందించడం, మృతదేహాలను దహనం చేయడంలో పోలీసులు ప్రజలకు సహకరించారు. 
 
మిషన్ హౌస్లా ప్రాజెక్టు కింద ప్రజల నుంచి 31,815 ఫోన్ కాల్స్ వచ్చాయి. పోలీసులు 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మంది ఆసుపత్రుల్లో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం చేశారు. ఉత్తరాఖండ్ పోలీసులు 17,609 మందికి మందులు తీసుకోవడానికి సహాయం చేశారు. 
 
మొదటి దశ కరోనా వేవ్ లో 1982 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలగా 8 మంది మరణించారు. తాజాగా ఉత్తరాఖండ్ పోలీసు విభాగంలో 2,300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో 751 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
కరోనా వైరస్ కారణంగా ఐదుగురు జవాన్లు, వారి కుటుంబసభ్యుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ పోలీసుల్లో 93 శాతం మందికి కొవిడ్ రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొవిడ్ పాజిటివ్ సంఖ్య గణనీయంగా తగ్గింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్, పడకలు, ప్లాస్మా అందించడానికి గత నెలలో ఉత్తరాఖండ్ పోలీసులు మిషన్ హౌస్లా అనే ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు