చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. సుమారుగా 192 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ముఖ్యంగా, వృద్ధులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఓ కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. వైరస్ చేరిన వస్తువులను చేత్తో పట్టుకోవడం ద్వారా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తెలిసిందే. వీటిలో తలుపులు తెరిచేప్పుడు డోర్‌నాబ్స్ పట్టుకోవడం, షాపింగ్‌లో కార్ట్స్, ఎలక్ట్రిక్ స్విచ్చులు ఉపయోగించడం కూడా ముఖ్యమైనవే.