కరోనా మహమ్మారి నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో సెకండ్ వేవ్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేసినా పరీక్షలు, మూల్యాకనం, పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది.
పాఠశాలల్లో ఆన్‌లైన్, దూర విద్య తరగతులు కొనసాగుతాయని, కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఆన్‌లైన్ బోధన, టెలీకౌన్సెలింగ్ ఉంటాయని, బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావాల్సి ఉంటుందని చెప్పింది.