భారత్‌లో ఓమిక్రాన్ 3వ కేసు: గుజరాత్‌లో జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి...

శనివారం, 4 డిశెంబరు 2021 (16:22 IST)
ఓమిక్రాన్ మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జింబాబ్వే నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఇది మూడో ఓమిక్రాన్ కేసు.
 
 
జామ్‌నగర్ నివాసి అయి ఈ 72 ఏళ్ల వ్యక్తికి గురువారం కోవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జై ప్రకాష్ శివరే ధృవీకరించారు. ఆ వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

 
తాము అతడిని ఐసోలేట్ చేసి పర్యవేక్షిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. అతను వున్న చోట మైక్రో కంటైన్‌మెంట్ జోన్ చేయబడిందని తెలిపారు. ఆ ప్రాంతంలో తాము వ్యక్తులను గుర్తించి అందరికీ పరీక్షలు చేస్తామని తెలిపారు.
 
భారతదేశంలోని ఇప్పటికే నమోదైన రెండు కేసులు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడు, అతనికి ప్రయాణ చరిత్ర లేదు. అలాగే 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు భారతదేశానికి వచ్చారు. అతడికి ఓమిక్రా వున్నట్లు నిర్థారించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు