పటేల్ 119 పరుగులిచ్చి ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా, భారతదేశం మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్ తన పదవ వికెట్‌ను తీయగానే, రవిచంద్రన్ అశ్విన్ కూడా కివీస్ స్పిన్నర్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడానికి లేచి నిలబడి, అద్భుతమైన ఫీట్‌ను గుర్తించాడు.
అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన జిమ్ లేకర్ 1956లో టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్ గా నిలువగా, ఆ తర్వాత 1999లో పాకిస్థాన్‌పై భారత ఆటగాడు అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు న్యూజీలాండ్ ఆటగాడు రికార్డు సృష్టించాడు.