ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:29 IST)
ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో 50 యేళ్ళ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.  
 
మన దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1272 వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
దీంతో ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెందిన శాంపిల్స్‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేకరించి, హైదారాబాద్ నగరంలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసుతో కలుకుని ఈ జిల్లాలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు