ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు శుభవార్త చెప్పారు. కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ వ్యాక్సిన్ కనిపెట్టింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని ప్రకటించారు. మనుషులపై కరోనా టీకాను ఇదివరకు చైనాలో ప్రయోగించినా ఫలితాలు ఆశాజనకంగా లేని నేపథ్యంలో అందరి దృష్టీ ఆక్స్‌ఫర్డ్ టీకాపై ఉంది.
లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఫలితాల ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలు పరిశోధకులు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాలంటీర్లపై ప్రయోగించగా రోగనిరోధక శక్తి పెరిగిందని తేలింది. ఈ వ్యాక్సిన్ ద్వారా చాలామందికి జ్వరం, తలనొప్పి తగ్గాయని.. 1,077 మందిపైకి ఈ టీకాను ఇవ్వగా వారిలో యాంటీబాడీస్ పెరిగాయని పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్‌ను అడ్డుకునే తెల్ల రక్తకణాలు కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా బాగా ఉత్పత్తి అయ్యాయి. కానీ పెద్దగా దుష్పరిణామాలు కూడా కనిపించలేదు. కానీ ఇది ప్రయోగాలకే పరిమతమని, విస్తృత స్థాయిలో రోగులపై పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.