కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌తో వస్తున్నారు, విమానం దిగగానే ఒమిక్రాన్ పాజిటివ్, నిషేధం తప్పదా?

శనివారం, 4 డిశెంబరు 2021 (20:00 IST)
విదేశీ విమానాలు మన దేశానికి వస్తుండటంతో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోను ఒమిక్రాన్ లక్షణాలు ఉన్న వారే ఎక్కువగా విదేశాల నుంచి వస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో తెలంగాణాలో ఒకటి, కర్ణాటక రాష్ట్రంలో రెండోది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోను మరో కేసు నమోదైంది. 

 
అది కూడా గుజరాత్ జామ్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఆ వ్యక్తి ఇటీవలే జింబాబ్వే నుంచి వచ్చారట. విమానాశ్రయానికి వచ్చి ఇంటికి వెళ్ళిన తరువాత టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందట.

 
దాంతో పాటు ఒమిక్రాన్ లక్షణాలు కూడా ఉండడంతో హుటాహుటిన అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స చేస్తున్నారట. విదేశాల నుంచి ఎక్కువగా భారతదేశానికి రాకపోకాలు ఉండటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

 
అయితే విదేశీ విమానాల రాకపోకలకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకుని విమానం ఎక్కిన ప్రయాణీకులకు విమానం దిగిన తరువాత పాజిటివ్ రావడం ఏమిటో ఇప్పటికీ వారికి అర్థం కావడం లేదట. ఇలా చాలామంది ప్రయాణీకులకు లక్షణాలు వస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు