దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు, దానిపై యుద్ధం చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఈ ఫండ్ నుంచి కరోనాపై పోరుకు భారీగా నిధులు కేటాయించింది.
మరోవైపు, కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం చేయని పోరాటమంటూ లేదు. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం చేపడుతున్న చర్యలకు బ్రిక్స్ దేశాలకు చెందిన 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' ఆర్థికసాయం ప్రకటించింది.
ఇందులోభాగంగా, భారత్‌కు 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.7.5వేల కోట్లపైగా రుణం అందించాలని ఈ బ్యాంకు నిర్ణయించింది. ఏప్రిల్ 30న ఈ రుణానికి బ్యాంకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని నిరోధించి తద్వారా సామాజిక, ఆర్థిక, ప్రాణ నష్టాలు జరగకుండా చూసేందుకు ఈ రుణం అందిస్తున్నట్లు తెలిపింది.