తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం ఆక్సిజన్, ఐసియూ పడకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గతంలో కరోనా పాజిటివ్ వస్తే చాలు బాధితులు ఉరుకులు పరుగులు మీద ఆసుపత్రికి వచ్చేవారు.
లక్షణాలు లేకపోయినా పాజిటివ్ తేలితే ఆసుపత్రులకు వచ్చి సాధారణ పడకల్లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేవారు. ప్రస్తుతం సాధారణ లక్షణాలుంటే ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా తగ్గింది. కేవలం ఆక్సిజన్, ఐసియూ కావలసిన రోగులు మాత్రమే ఆస్పత్రికి వెళుతున్నారు.