కరోనా వైరస్ పైన యుద్ధం, దక్షిణాఫ్రికా అద్భుత విజయం

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (14:37 IST)
“కోవిడ్‌–19”ను నియంత్రించడంలో ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా దక్షిణాఫ్రికా రాణించింది. ఏప్రిల్‌ 25 నాటికి  అక్కడ 4,300 కేసులు నమోదైతే, 85 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. పెరుగుతున్న కరోనా కేసులు నేపధ్యంలో దక్షిణా ఫ్రికా మార్చి 26 నుంచి  “లాక్‌డౌన్”‌ అమల్లోకి  తెచ్చింది. అయితే ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆ దేశం రూపొందించిన “రిస్క్‌ ఎడ్జెస్టెడ్”‌ వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
 
మే 1 నుంచి దశలవారీగా “లాక్‌డౌన్”‌ ఎత్తేయాలని నిర్ణయించిన దక్షిణాఫ్రికా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యూబా నుంచి వైద్యుల్ని రప్పించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రావిన్స్‌లలో క్యూబా వైద్యుల్ని మోహరించాక, ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది.

మే 3 తర్వాత మన దేశంలో కూడా “లాక్‌డౌన్‌”ను ఎత్తివేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్న నేపధ్యంలో  “లాక్‌డౌన్”‌ను దశల వారీగా ఎత్తివేయడానికి ఆరోగ్యం, ఆర్థికం మధ్య సమతుల్యత సాధించడానికి ఆ దేశం రచించిన వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నేపధ్యంలో 
ఆంక్షల్ని సడలించడానికి వివిధ ప్రణాళికలను రచిస్తున్న కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది.
 
దక్షిణాఫ్రికా వ్యూహం అత్యుత్తమంగా ఉందంటున్న కేంద్ర అధికార యంత్రాంగం, “కరోనా” వైరస్‌ వ్యాప్తి, ఆయా ప్రాంతాల్లో దానిని ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య రంగంలో ఉన్న సన్నద్ధత ఆధారంగా దేశాన్ని అయిదు జోన్లుగా విభజన చేయాలని భావిస్తోంది. ఒక్కో జోన్‌లో ఒక్కో విధమైన ఆంక్షలు ఉంటాయి. అయితే సినిమా థియేటర్లు, హోటళ్లు, పర్యాటకం, క్రీడల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుంది.
 
బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. 60 ఏళ్ల పైబడిన వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇంటి నుంచి పని చేసుకోవడానికి అనుమతినిస్తారు. వైరస్‌ తక్కువ వ్యాప్తి, పూర్తిస్థాయి సన్నద్ధత వుంటే అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తాయి.
 
పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తూ అన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రావిన్స్‌ల మధ్య రవాణాకు అనుమతిస్తారు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి. మధ్యస్థంగా వైరస్‌ వ్యాప్తి, పూర్తి స్థాయి సన్నద్ధత. నిర్మాణం, తయారీ, మైనింగ్, రిటైల్, పారిశుద్ధ్యం, ఐటీ, ప్రభుత్వ రంగాలన్నింటికీ అనుమతి ఇస్తారు.
 
 విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాలు పునరుద్ధరణ. 1, 2 జోన్లలో ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలకు అనుమతి. వైరస్‌ వ్యాప్తి మధ్యస్థం, సన్నద్ధత కూడా మధ్యస్థం. నిత్యావసరాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, విద్యారంగం, రిటైల్‌తో పాటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, టేక్‌ ఎవే రెస్టారెంట్లు, ఇ–కామర్స్‌ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం.
 
మధ్యస్థం నుంచి వైరస్‌ తీవ్రత ఎక్కువ, ఓ మోస్తరు సన్నద్ధత. నిత్యావసరాలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, కాగితం, మైనింగ్‌ రంగాలకు, టెలికం, ఐటీ రంగాలకు అనుమతి వుంటుంది. భౌతిక దూరం పాటించేలా అతి తక్కువమందితో ప్రయాణాలకు అనుమతి. 
ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం. వైరస్‌ వ్యాప్తి అధికం, తక్కువ స్థాయి సన్నద్దత. కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి. బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి. ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలు ఉండవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు