రెండో డోస్ వ్యాక్సిన్ కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:05 IST)
కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోవాల్సిన వారి కోసం జిల్లా వ్యాప్తంగా తీసుకోవలసిన వ్యక్తుల కోసం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టరు ఏ.ఎండి. ఇంతియాజ్ తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వ్యక్తులు దాదాపు నలబై వేల మంది వున్నారని తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 6 నుంచి 8 వారాల మధ్య రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు. 
 
కో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు. అందువల్ల ఉదయం 7.30 నుంచి రెండవ డోసు వేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

అందువల్ల మొదటి డోసు వేసుకొని నిర్ణీత సమయం పూర్తి అయిన వ్యక్తులు గురువారం నాడు అదే వ్యాక్సిన్ రెండో డోసు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెషన్ సైట్‌ల వద్ద వేసుకోవచ్చునని వివరించారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి  వెళ్లేటప్పుడు తమ అధార్ కార్డ్  ను వెంట తీసుకొని వెళ్లాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు