కరోనా వైరస్ వేయించుకుంటే ఆస్తి పన్ను చెల్లింపులు రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది.
ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.