మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాక్సీన్ డోసులను 50 శాతం కేంద్రానికి, 50 శాతం ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వడమనే నిబంధన భారతదేశంలోని అన్ని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు వర్తిస్తుంది. అయితే, పూర్తిగా వినియోగానికి సిద్ధంగా దిగుమతి అయిన టీకాలను ప్రభుత్వేతర మార్గాలలో ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది.