కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వివిధ దేశాలు పలు రకాలైన టీకాలను తయారు చేశారు. ఇలాంటి వాటిలో రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి ఒకటి. ప్రస్తుతం ఈ టీకా కూడా భారత్‌లో వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్ కరోనా అన్ని వేరియంట్లను అడ్డకుంటున్నట్లు గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ వెల్లడించింది.
కరోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కనిపించిన వేరియంట్లను స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రేరిత సేరా ఎలా అడ్డుకుంటుందో పరిశీలించారు. అంతేకాదు ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కలిసి వ్యాక్సిన్ కాక్‌టెయిల్స్‌ను తయారు చేసే దిశగా గమలేయా, ఆర్డీఐఎఫ్ అధ్యయనం నిర్వహిస్తోంది.