దేశంలో మరో 3.57 లక్షల కరోనా పాజిటివ్ కేసులు

మంగళవారం, 4 మే 2021 (10:54 IST)
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెండు కోట్ల మార్క్‌ను దాటగా.. వరుసగా మూడో రోజు కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 3,57,229 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రం కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 
 
కొత్తగా 3,449 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. తాజాగా 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగింది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కోలుకున్నారు.
 
మహమ్మారి బారినపడి మొత్తం 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో భాగంగా 15,89,32,921 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. 
 
నిన్న ఒకే రోజు 16,63,742 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌లోనే రెండు కోట్ల కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 7,432 మంది కోలుకున్నారని పేర్కొంది. నిన్న 70,961 టెస్టులు చేయగా.. 6,876 కేసులు రికార్డయ్యాయని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,029, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 502, రంగారెడ్డి జిల్లాలో 387 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది. 
 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,63,361కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,81,365 మంది కోలుకున్నారు. మొత్తం వైరస్‌ బారినపడి 2,476 మంది ప్రాణాలు విడిచారు. మరణాల రేటు 0.53 శాతం ఉండగా.. రికవరీ రేటు 82.30శాతం ఉందని ఆరోగ్యశాఖ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు