పృథ్వీరాజ్‌కు కరోనా వచ్చినట్టా.. లేనట్టా?: నెటిజన్లు

బుధవారం, 5 ఆగస్టు 2020 (19:23 IST)
నటుడు పృథ్వీరాజ్‌కు కరోనా వచ్చినట్టా..? లేనట్టా అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నటుడు పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు లోనై.. పదిరోజుల పాటు జ్వరంతో బాధపడుతూ వచ్చాడు. 
 
కానీ కరోనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని ఓ వీడియో విడుదల చేసారు. కాగా మళ్ళీ బుధవారం ఆయన తనకు కరోనా పాజిటివ్ అని తాను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు ఫోన్ చేసి దైర్యం చెప్పారని అన్నారు. ఆయన దైర్యం చెప్పిన వీడియోనే పదే పదే చూస్తున్నానని చెప్పారు. యుద్ధరంగంలో దిగాక పోరాడాలని రాంబాబు గారు తనలో దైర్యం నింపాడని చెప్పారు. 
 
రోజు రోజుకీ తన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. అయితే పృథ్వీరాజ్ వీడియో చూసిన నెటిజన్లు అసలు కరోనా వచ్చినట్టా.. లేదా అని కామెంట్‌లు పెడుతున్నారు. నిన్న తనకు నెగిటివ్ వచ్చిందని మళ్ళీ ఈరోజు పాజిటివ్ వచ్చిందని చెప్పటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు