రైల్వే స్టేషన్‌ను చెరోసగం పంచుకుంటున్న 2 రాష్ట్రాలు... ఎక్కడ?

సోమవారం, 6 జులై 2020 (14:01 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగిన సంస్థ భారతీయ రైల్వే. ఈ సంస్థలో వింతలూ విశేషాలకు ఏమాత్రం కొదవలేదని చెప్పొచ్చు. కానీ అవి పెద్దగా బయటకు రావు. కానీ, సాక్షాత్ రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఓ వింతైన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అదేంటంటే.. ఓ రైల్వే స్టేషన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 
 
అలాంటి రైల్వే స్టేషన్ గుజరాత్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఈ విషయాన్ని మంత్రి పియూష్ గోయల్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్‌లో మరో సగం మహారాష్ట్ర భూభాగంలో వస్తుంది. దీంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 
'దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఓ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. 
 
కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది' అని మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఇలాంటి స్టేషన్ ఇదొక్కటే కాదు.. 'భవానీ మండి' రైల్వే స్టేషన్ కూడా ఉది. ఈ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

#KyaAapJanteHai देश में एक रेलवे स्टेशन ऐसा भी है जो दो राज्यों में स्थित है?

सूरत-भुसावल लाइन पर नवापुर एक ऐसा स्टेशन है, जहां स्टेशन के बीचो-बीच दो राज्यों की सीमाएं लगती हैं। इसलिये इस स्टेशन का आधा भाग गुजरात में, तो शेष आधा महाराष्ट्र मे है। pic.twitter.com/FKSdsjvUOR

— Piyush Goyal (@PiyushGoyal) July 4, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు