అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండ్ వేవ్‌తో పోలిస్తే అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. చిన్నారులకు వైద్యం కోసం ప్రత్యేకంగా 3,900 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
థర్డ్‌వేవ్‌కి వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలన్నారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలని తెలిపారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో పాటు, ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.