తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తారు. రెండో దశలో రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో దశలో 50 ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తారు. వీరంతా దేశ వ్యాప్తంగా 22 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా. కరోనా పోరాటంలో ముందు ఉన్న వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 50 ఏళ్ల పైబడ్డవారికి ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.
ఇందులో భాగంగా వ్యాక్సిన్ స్టోరేజ్ , పంపిణీ పై కేంద్రం గైడ్ లైన్స్ రిలీస్ చేసింది. మొదట హెల్త్ వర్కర్లకు తర్వాత ఫ్రాంట్ లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత మూడవ రౌండ్ లో 50 ఏళ్ళు పై పడిన వారికి ఇతర జబ్బులు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు.