దేశంలో పెరిగిన కరోనా వైరస్ పాజటివ్ కేసులు

శనివారం, 24 జులై 2021 (10:29 IST)
దేశంలో మరోమారు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 39,097 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది. 
 
ఇందులో 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 35,087 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,05,03,166కి చేరింది.
 
ఇకపోతే, శుక్రవారం 546 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,20,016 చేరుకుంది. ఇదిలావుంటే ఇప్పటిదాకా 42.78 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు