దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోల్చితే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఈ వైరస్ బారి నుంచి 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.
ఇదిలావుంటే, యాక్టివ్ కేసుల సంఖ్య 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది.