ఏపీలో మళ్లీ వెయ్యి క్రాస్ అయిన పాజిటివ్ కేసులు

మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు హెచ్చుతగ్గులుగా ఉంది. సోమవారం వెల్లడించిన వివరాల మేరకు 909 కేసులు నమోదు కాగా, మంగళవారం లెక్కల ప్రకారం ఈ కేసుల సంఖ్య 1063కు చేరింది. ఈ కేసులన్నీ గత 24 గంటల్లో నమోదయ్యాయి. 
 
తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా…11 మంది మృతి చెందారు. ఇదేస‌మ‌యంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి చేరుకోగా ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతి చెందిన‌ వారి సంఖ్య 13,671కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 19,65,657 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు