కొనసాగుతున్న కరోనా విజృంభణ : మరో 42 వేల పాజిటివ్ కేసులు

బుధవారం, 4 ఆగస్టు 2021 (10:12 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజువారీ కేసులను పరిశీలిస్తే సోమవారం 24 గంటల్లో 30 వేలకు దిగిరాగా.. తాజాగా  అంటే గత 24 గంటల్లో 42 వేలకు పైగా నమోదయ్యాయి. మొత్తం 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,25,757 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది. 
 
దేశంలో ఇప్పటివరకు 47.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు