డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దేశీయ తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. రష్యా నుంచి మొదటి విడతలో 31.5లక్షలు, రెండో విడతలో 4.5 లక్షల స్పుత్నిక్ వీ డోసులు భారత్‌కు వచ్చాయి.
మే నెలలో దేశవ్యాప్తంగా సాఫ్ట్‌పైలట్ కింద వాణిజ్యపరంగా రష్యా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించామని, ప్రస్తుతం దాదాపు 80 నగరలలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నది అని డా.రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది.