టిటిడి ఉద్యోగులు గ్రేట్.. కరోనా వైరస్ నిరోధించేందుకు భారీ విరాళం

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:36 IST)
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలకు అవసరమైన డబ్బులు లేవు. అందులోను ఎపిలో ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. అయితే మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారి చెంత పనిచేసే ఉద్యోగులు సిఎం సహాయనిధికి విరాళం ఇచ్చారు.
 
అది కూడా అక్షరాలా 83 లక్షల 86 వేల 747 రూపాయలు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో కలిసి వెళ్ళిన టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా తాడేపల్లి గూడెంలోని ముఖ్యమంత్రికి చెక్కు రూపంలో నగదును అందజేశారు. టిటిడిలో శాశ్వత ఉద్యోగులు 7 వేల మంది, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 14 వేల మంది ఉన్నారు. మొత్తం 21 వేల మంది ఉద్యోగులు తమ మార్చి నెల జీతం మొత్తాన్ని సిఎంకు విరాళంగా అందజేశారు.
 
టిటిడి ఉద్యోగులు, సిబ్బంది తీసుకున్న నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో అందరు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి కూడా ఆనందం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు