దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20 వేలకు దగ్గరగా అంటే, 19,148 కేసులు నమోదయ్యాయి. ఇందులో 434 మంది ప్రాణాలు విడిచారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారము దేశం మెత్తంలో 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా 3,59,859 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,29,588 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 90,56,173 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడమైనది.