ఫేస్ మాస్క్‌లతో పాటు, ప్రోగ్రామబుల్ బయోసెన్సర్‌లను ఇతర వస్త్రాలతో కలిపి ధరించడం ద్వారా ప్రమాదకరమైన పదార్థాలను ముందుగానే గుర్తించవచ్చునని చెబుతున్నారు. మూడేళ్ల పరిశోధన ఫలితమే ఈ టెక్నాలజీ అని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు మొదట ఈ టెక్నాలజీని 2015లో జికా వైరస్‌ను గుర్తించడానికి ఒక టూల్ ఉపయోగించారు. అందులో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి.