లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మార్కెట్ల వెంటపడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కుంటున్నారు. వారి హడావుడే ఆసరాగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి.