చెవి దగ్గర గుసగుసలాడవద్దు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే రాజ్యసభలో సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సూచనలు చేశారు. కరోనా రాకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ఖచ్చితంగా అనుసరించాలని వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు.
 
ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని తెలిపారు. ఎవరు కూడా తమ స్థానాలను వదిలి వెళ్లొద్దని తెలిపారు. దీంతో పాటు చెవిలో వంగి గుసగుసలాడవద్దని కూడా విజ్ఞప్తి చేసారు. ఇలా చేయడం మానుకోవాలని ఇతర సభ్యులతో ఏదైనా చెప్పాలనుకుంటే దానిని స్లిప్ మీద రాసి ఇవ్వాలని తెలిపారు.
 
అలాగే సభ్యులెవరూ తమ కార్యాలయానికి రావద్దని తెలిపారు. కలవాలని తమకు ఉన్నా ప్రస్తుత పరిస్థితి రీత్యా భద్రతా ప్రమాణాలు అనుసరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు ఎన్నడూ లేని రీతిలో జరుగుతున్నాయి. కరోనా నియమాలు పాటించి సీటింగ్ అరేంజ్ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు