స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదిగిన ప్రణబ్ : ఉపరాష్ట్రపతి

సోమవారం, 31 ఆగస్టు 2020 (19:09 IST)
స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహానేత ప్రణబ్ ముఖర్జీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 
 
ప్రణబ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ప్రణబ్ ముఖర్జీ సామాన్య స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయికి స్వయంకృషితో ఎదిగారని కొనియాడారు. అలాగే, గతయేడాది ఆగస్టు 8వ తేదీన భారతరత్న పురస్కారం అందుకున్నారని గుర్తుచేశారు. 
 
ప్రణబ్ ముఖర్జీ తన జీవితాన్ని సామాన్య స్థాయి నుంచి ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణ, అంకిత భావాలతో  దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మన దేశం ఓ గొప్ప పెద్ద మనిషిని కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు