ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగు కనిపెట్టే పనిలో అనేక దేశాలు నిమగ్నమైవున్నాయి. భారత్‌తో పాటు చైనా, అమెరికా, రష్యాన్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇజ్రాయేల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. అయితే, బ్రెజల్ జరుగుతున్న టీకా ప్రయోగాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయాడు. ఈ టీకాను ఆస్ట్రాజెనెకా బయోఫార్మా కంపెనీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటితో కలిసి అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రెజిల్ కూడా అధికారికంగా నిర్ధారించింది.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ టీకాను పరీక్షిస్తున్నారు. మొదటి, రెండోదశ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇటీవలే మళ్లీ ఈ ప్రయోగాలను ప్రారంభించారు. మూడో దశలో ఈ టీకాను వేయించుకున్న ఓ వలంటీర్ మృతి చెందినట్టు బ్రెజిల్ ఆరోగ్య విభాగం నిన్న వెల్లడించింది. అయితే, అతడు వ్యాక్సిన్ కారణంగా మరణించాడా? లేక, మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వెల్లడించని అధికారులు, పరీక్షలు మాత్రం కొనసాగుతాయన్నారు.